Tuesday, August 3, 2021
spot_img

వరిగెల తో వందేళ్ల ఆయుష్షు..!

వరిగెలు చాలా మందికి తెలియదు.. కానీ వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వరిగెల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వరిగెలతో కిచిడి, ఇడ్లి, సమోసాతోపాటు స్వీట్స్‌కూడా చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్‌, ప్రొటీన్స్‌, ఫ్యాటీ యాసిడ్స్‌, న్యూట్రియంట్స్‌, బి కాంప్లెక్స్‌ వంటి పోషకాలు అపారంగా ఉంటాయి.వరిగెల్లోని లెసిథిన్‌ అనే పదార్థం నరాల పనితీరును మెరుగు పరుస్తుంది. రోజూ తగిన మోతాదులో తీసుకుంటే నయాసిన్‌, విటమిన్‌ బి3 లోపాలు రావని పోషక నిపుణులు చెబుతున్నారు.

అలాగే, యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ని తొలగించి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి.మెగ్నీషియం శరీరంలో గ్లూకోజ్‌, ఇన్సులిన్‌ లెవల్స్‌ని నియంత్రణలో ఉంచుతుంది. ఇది పూర్తిగా గ్లూటెన్‌ ఫ్రీ పదార్థం కాబట్టి, గోధుమలకు బదులు వరిగెలను ఎంచుకోవచ్చు. వీటిలోని ఫైటిక్‌ యాసిడ్‌ దేహంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. ఇవి బయట దొరుకుతున్నాయి.. మీరు కూడా తినడం అలవాటు చేసుకోండి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,883FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles