Sunday, July 25, 2021
spot_img

అమెజాన్ ప్రైమ్ లో రవితేజ మూవీ ..

ప్రస్తుత దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మేరకు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ వైపు పరుగులు పెడుతున్నాయి. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు వారి సినిమాలను ఇక్కడే విడుదల చేస్తున్నారు. తాజాగా రవితేజ సినిమా కూడా ఇక్కడే విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో పెద్ద హిట్ ఇచ్చాడు. రవితేజ కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత సినిమాగా రవితేజ ‘ఖిలాడి’ చేస్తున్నాడు.

రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కుదరడం లేదు. అందువలన థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు.ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘అమెజాన్ ప్రైమ్’ వారు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది. మరి థియేటర్ రిలీజ్ తరువాత ఈ సినిమా ఓటీటీలో వస్తుందా? లేదంటే నేరుగా ఓటీటీలోనే వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles