Wednesday, August 4, 2021
spot_img

తూర్పు గోదావరి లో ఘోర రోడ్డు ప్రమాదం..

తూర్పు గోదావరి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. విధులు నిర్వహిస్తున్న పోలీసులను లారీ మృత్యువు రూపంలో వచ్చి కాటేసింది..సామర్లకోట ఉండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోలింగ్ వెహికల్‌తో ఉన్న ఇద్దరు పోలీసులపై లారీ దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతులను తిమ్మాపురం పోలీసు స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మెండి సత్యనారాయణ, హోం గార్డు ఎన్ఎస్‌రెడ్డిగా గుర్తించారు. విజయవాడ నుంచి వచ్చే కోవిడ్ వ్యాక్సిన్‌ వాహనానికి ఎస్కార్ట్ విధుల కోసం ఉండూరు వంతెన వద్ద వేచి ఉండగా ఈ ప్రమాదం జరిగింది.. వెంటనే ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles