Sunday, July 25, 2021
spot_img

లావా ముందు సెల్ఫీలు..ఎంటో..

ప్రమాదం ఉందని తెలిస్తే అటుగా అస్సలు వెళ్లరు.. కానీ కొందరు మాత్రం ప్రమాదం తోనే పరాచకాలు ఆడుతున్నారు. సెల్ఫీలు దిగుతూ రెచ్చిపోతున్నారు. కాంగో దేశంలో అగ్నిపర్వతం బద్దలైంది. ఆ సమయంలో పెళ్లుబికిన లావా వల్ల 32 మంది మరణించారు. ఇంతటి ఘోరం జరగడంతో ప్రభుత్వ అధికారులు తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ సమయంలో కొందరు స్థానికులు లావా ముందుకొచ్చి సెల్ఫీలు తీసుకుంటూ హల్‌చల్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డెమొక్రటిక రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో ఉన్న న్యిరాగోంగో అగ్నిపర్వతం తాజాగా బద్దలైంది. దీన్నుంచి లావా పెళ్లుబికి కిందకు పారింది. ఈ ఘటనలో 32మంది ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.పరిస్థితి కొంత నెమ్మదించిన తర్వాత అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రభావిత ప్రాంతాన్ని అధికారులు ఒక పక్క ఖాళీ చేయిస్తుంటే.. మరికొందరు మాత్రం తమ మొబైల్స్ పట్టుకొని లావా దగ్గరకు వచ్చి సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles