Thursday, July 22, 2021
spot_img

ఏపీలో సోనూ సూద్ కు పాలాభిషేకాలు..

సోనూ సూద్ పేరు ఇప్పుడు తెలియని వాళ్ళు ఉండరేమో అంతగా అతను ఫెమస్ అయ్యారు. దేశ వ్యాప్తంగా చాలా మంది ఆయనను దేవుడుగా పూజిస్తున్నారు. దాంతో రీల్ హీరో కాస్త రియల్ హీరో గా మారాడు. ఎందరో ఆయనకు గుడి కట్టే ఆలోచనలో ఉన్నాఋ అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఎపి ప్రజలు ఆయనకు పాలాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళితే.. కరోనా కష్టకాలంలో నటుడు సోనూసూద్ ఎంతో మందికి సాయం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన ఏపీలోని కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నారు. తమ జిల్లాలకు ఆక్సిజన్ ప్లాంట్‌ను ఇస్తున్నందుకు ఆ జిల్లాల్లోని ప్రజలు సోనూసూద్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. సోనూసూద్‌ను ఆదర్శంగా తీసుకుని అందరూ తమవంతు సాయం చేయాలని కర్నూలు, నెల్లూరు జిల్లాల ప్రజలు కోరుతున్నారు. కాగా సోనూసూద్ ఈ ఆక్సిజన్ ప్లాంట్లను దేశంలోని మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,862FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles