Tuesday, August 3, 2021
spot_img

కేటీఆర్ పై సోను సూద్ స్పెషల్ కామెంట్స్..

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రశంసించారు. కేటీఆరే నిజమైన హీరో అంటూ కొనియాడారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సోనూసూద్ పేర్కొన్నారు.

అయితే నంద కిశోర్ తోకల అనే ఓ నెటిజన్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. తాము సంప్రదించిన 10 గంటలలోపే తమకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చారని, ఆ మేలు ఎప్పటికీ మరిచిపోలేమని అతను పేర్కొన్నాడు. అదే ఒరవడిని తెలంగాణ ప్రజల కోసం కొనసాగించడం అభినందించదగ్గ విషయమన్నారు.

ఈ సందర్భంగా తాను చెప్పదలుచుకున్నది ఒక్కటే.. అదేంటంటే నిజమైన సూపర్ హీరో కేటీఆర్ అని నంద కిశోర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై కేటీఆర్ స్పందించారు.ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడిని, తనకు చేతనైనంతా సహాయం చేస్తున్నాను. సూపర్ హీరో తాను కాదు. సూపర్ హీరో అని మీరు సోనూసూద్‌ను పిలవచ్చు అని కేటీఆర్ రీట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌పై సోనూసూద్ స్పందిస్తూ.. కేటీఆర్‌కు థ్యాంక్స్ చెప్పారు. కానీ తెలంగాణ ప్రజల కోసం ఎంతో చేస్తున్న మీరే నిజమైన హీరో. మీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. తెలంగాణను నా రెండో ఇల్లుగా నేను పరిగణిస్తున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు నాపై ప్రేమ, అభిమానం చూపిస్తున్నారని సోనూసూద్ ట్వీట్ చేశారు.. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,883FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles