Thursday, August 5, 2021
spot_img

కరోనా లక్షణాలు ఉండి,రిపోర్ట్ నెగిటివ్ వస్తే ఇలా తప్పక చేయాలి..

తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు,దగ్గు , జలుబు వంటి లక్షణాలు ఉన్నా కూడా కొందరికి రిపోర్ట్ నెగిటివ్ వస్తుండటం చూస్తుంటాం.ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పలు కీలక సూచనలు చేసింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగిటివ్‌ వచ్చినా శరీరంలో కరోనా లక్షణాలు కనిపిస్తే మరోసారి టెస్టు చేయించుకోవాలని ఎయిమ్స్‌ సూచించింది. జ్వరం, పొడిదగ్గు, అలసట, వాసన కోల్పోవడం, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, గొంతు నొప్పి, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు వంటివి వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండటం మంచిదని పేర్కొంది.

కరోనా వచ్చినవారిలో ఇవి మొదటి సూచనలని, ఇప్పటివరకు వైరస్‌ సోకివారిలో 80 శాతం మందిలో ఈ తరహా లక్షణాలే కనిపించాయని ఎయిమ్స్‌ వైద్యులు పేర్కొన్నారు.కోవిడ్ పాజిటివ్ వచ్చిన 60 ఏళ్లు పైబడిన రోగులకు హైపర్‌టెన్షన్, డయాబెటిస్, హార్ట్ డిసీజ్, మూత్రపిండాలు , ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే.. వైద్యులను సంప్రదించాలని సూచించారు. మందులతో పాటు పరిశుభ్రత కూడా ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. అసలు తేలికపాటి లక్షణాలు కనిపించగానే ఐసోలేషన్‌లోకి వెళ్లడం ఉత్తమం అని పేర్కొన్నారు. అయితే కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మందులను వేసుకుంటున్నారని అవి మంచిది కాదని తెలిపారు.కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కరోనా పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles