Thursday, August 5, 2021
spot_img

మహేష్ లుక్ ను మార్చేయనున్న త్రివిక్రమ్..

సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత మహేష్ బాబు మామూలు బిజీగా లేడన్న విషయం తెలిసిందే.. ఒకవైపు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చేస్తూనే, మరో వైపున త్రివిక్రమ్ ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడు. ఈ సినిమా కథ ఎలా ఉంటుంది? మహేశ్ పాత్ర ఏమై ఉంటుంది? అనే ఆసక్తిని అభిమానులు కనబరుస్తున్నారు. అయితే ఇంతకుముందు లాక్ డౌన్ పెట్టినప్పుడే త్రివిక్రమ్ ఈ కథను రాసుకున్నారట.

లైన్ సింపుల్ గానే అనిపించినప్పటికీ, ట్రీట్మెంట్ త్రివిక్రమ్ స్టైల్ లోనే ఉంటుందని అంటున్నారు. ట్రీట్మెంట్ విషయంలో త్రివిక్రమ్ కి తిరుగులేదు గనుక, ఇక ఆలోచించవలసిన అవసరం లేదు.ఇక ఈ సినిమాలో మహేశ్ బాబును త్రివిక్రమ్ చాలా స్టయిలిష్ గా చూపించనున్నాడని అంటున్నారు. మహేశ్ లుక్ కొత్తగా ఉంటుందనీ, ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక త్రివిక్రమ్ తన సినిమాల్లో మాటలకు .. పాటలకు ఎంతో ప్రాధాన్యతని ఇస్తాడనే విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఇక మాటల్లేవని ప్రిన్స్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,884FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles