Thursday, July 22, 2021
spot_img

పసుపు తో లడ్డూలు చేసుకోవచ్చు..!

పసుపు తో కూరలు మాత్రమే కాదు.. తియ్యని స్వీట్స్ ను చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇందుకు కావలసిన పదార్థాలు.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

పచ్చి పసుపు తరుగు: 250 గ్రాములు,

బెల్లం: 250 గ్రాములు,

ఆవునెయ్యి: 4 టేబుల్‌ స్పూన్లు,

బాదం, కాజు: 100 గ్రాములు,

పుచ్చ పలుకులు: 50 గ్రాములు,

కొబ్బరిపొడి: అర కప్పు,

మిరియాలపొడి: అర టీస్పూన్‌,

పొప్పడి పలుకులు: ఒక టీస్పూన్‌

తయారీ విధానం:

ముందుగా కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి బాదం, కాజు, పుచ్చపలుకులు వేయించాలి. చల్లారాక మిక్సీపట్టి పొడి చేసుకోవాలి. అదే కడాయిలో పొప్పడి పలుకులు వేయించి పక్కన ఉంచుకోవాలి. మళ్లీ కడాయిలో ఒక టేబుల్‌స్పూన్‌ నెయ్యి వేసి, పసుపు తరుగు వేసి అడుగున అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరోగిన్నెలో బెల్లం పాకం పట్టుకోవాలి. అందులో బాదం, కాజు, పుచ్చపలుకుల పొడి, పొప్పడి పలుకులు, కొబ్బరిపొడి, మిరియాలపొడి వేసి కలుపుకోవాలి. తర్వాత చివరిలో పసుపు తరుగు వేసి మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలపాలి.. ఆ తర్వాత బాగా చల్లార్చి ఉండలుగా చేసుకోవాలి అంతే రుచి కరమైన లడ్డూలు రెడీ..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,864FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles