Saturday, July 17, 2021
spot_img

నిద్ర బాగా పట్టాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!

నిద్ర లేమి సమస్య ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా వస్తుంది.. నిద్ర పట్టడం లేదని చాలా మంది అంటారు.. అలాంటి వాళ్ళు ఈ టిప్స్ పాటిస్తే హాయిగా నిద్ర పోతారట అవేంటో ఒకసారి చూడండి..

గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి.

చేతివేళ్లతో లేదా దువ్వెనతో తలవెంట్రుకలను మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి.

చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి.
రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి.

రాత్రి పూట కాసిని గోరువెచ్చని పాలు తాగాలి.
నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్‌ ఫోన్‌ చూడటం మానేయాలి. అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్‌ పెట్టుకుంటే రేడియేషన్‌ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్‌ను దూరంగా పెట్టడం మంచిది.

రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి లేదా ఏవైనా సుందర దృశ్యాలను ఊహించుకోవాలి.

కొంత మందికి ముక్కు ద్వారా సరిగా గాలి లేకున్నా కూడా నిద్ర పడదు.. అలాంటి వాళ్ళు నెయ్యిని వేడిచేసి.. రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే హాయిగా నిద్ర పోతారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,863FollowersFollow
18,000SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles