Sunday, July 25, 2021
spot_img

ఎంపీ రఘురామ అరెస్ట్ వెనక ఇంత మ్యాటర్ ఉందా?

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ అరెస్టును ఏపీ సీఐడీ ధ్రువీకరించింది. ఈ మేరకు ఏపీ సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్ పేరిట ప్రకటన వెలువడింది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా మాట్లాడారని, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఎంపీ రఘురామకృష్ణరాజుపై అభియోగాలు మోపినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చారని ఆరోపించారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేశామని ఏపీ సీఐడీ వెల్లడించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ఎంపీ అరెస్ట్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పలు రాజకీయ చర్చలు మొదలయ్యాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
2,869FollowersFollow
18,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles