మన ఇండియాలో అమెజాన్ అంటే తెలియని వారుండరు. అంతలా అందరికి చేరువయ్యింది. ఇప్పుటికే అమెజాన్ ఎన్నో రకాల వస్తు సేవలను , ప్రైమ్ స్ట్రీమింగ్ మూవీస్ , ప్రెమెంట్స్ వంటి తదితర సేవలను అందిస్తుందని మనందరికీ తెలుసు. ఇప్పుడు అమెజాన్ సరికొత్త ఫీచర్ను తీసుకువస్తుంది. అమెజాన్ యాప్ లోనే మినీ టీవీ ఫీచర్ ను కల్పించింది. తొలిసారిగా భారత దేశంలో ఈ ఉచిత స్ట్రీమింగ్ సదుపాయాన్ని కల్పించింది. మినీ టీవీ లో వెబ్ సిరీస్, టెక్నాలజీ న్యూస్, ఫుడ్ వెరైటీస్ , ఫాషన్ వంటి తదితర వీడియోలను వాటిని ఉచితంగా చూడవచ్చు. అయితే యాడ్స్ ఉంటాయి.

ఇప్పటివరకు అమెజాన్ యాప్ లో షాపింగ్, ప్రెమెంట్స్ కోసం మాత్రమే వీలుండేది. కానీ తాజాగా ఫ్రీ ఎంటర్టైన్మెంట్ వీడియోలను కూడా చూసుకునే వీలుంటుంది. ఇలాంటి సదుపాయాన్నే 2019లో ఫ్లిప్ కార్ట్ తెచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ అమెజాన్ మినీ టీవీ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలోనే అందుబాటులో ఉంది . కొన్ని నెలల తర్వాత అన్ని మొబైల్ ఫోన్లలో వచ్చే విధంగా చేస్తారని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అమెజాన్ మినీ టీవీ ప్రత్యేకంగా యాప్ అవసరం లేదు.అమెజాన్ యాప్ లోనే ఫ్రీగా కామెడీ షోస్ , ఫాషన్ , ఫుడ్ వంటి వాటిని చూడొచ్చు. ఇందులో యాడ్స్ తో వీడియో కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా అమెజాన్ దేశంలోనే నెంబర్1 గా నిలుస్తుంది.