తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారకరామారావు అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఎంత స్నేహభావం గా మెలిగారో .. ఆ తర్వాత తరచూ వీరిద్దరి మధ్య పోటీతత్వం ఏర్పడి గొడవలకు కూడా దారితీసింది. అయితే ప్రత్యక్షంగా ఇద్దరూ ఏ ఒక్క రోజు కూడా గొడవ పడింది లేదు. కానీ అటు సినిమాల విషయంలో.. ఇటు కథల ఎంపిక విషయంలో.. అలాగే రాజకీయ రంగంలో కూడా ఒకరికి ఒకరు పోటీ గా వ్యవహరించారు. ఇదిలా ఉండగా డిజిటల్ ప్రపంచంలో మారుతున్న కాలం కొద్దీ ఆహా ఓ టీ టీ ఊహించని కలయికలను ఏకం చేస్తోంది. మొన్నటి వరకు బాలకృష్ణకు , రవితేజ కు గొడవలు ఉన్నాయని పెద్ద ఎత్తున సినీ ఇండస్ట్రీలో ప్రచారం అయినా.. బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే .అయితే ఈ షోకి రవితేజ కూడా హాజరై వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు.

ఇక తాజాగా మొదటి సీజన్ చివరి ఎపిసోడ్ కి సూపర్ స్టార్ కృష్ణ కొడుకు మహేష్ బాబు హాజరైన విషయం తెలిసిందే. ఇకపోతే అటు బాలయ్య బాబు తండ్రి , ఇటు మహేష్ బాబు తండ్రి ఇద్దరు సినిమాల విషయంలో పోటీ పడి వీరిద్దరి మధ్య మాటలు లేవని అందరికీ తెలుసు కానీ ఆహా మాత్రం వారి వారసులను ఒకేచోట కలిపి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది పూర్తిగా జనరంజకంగా వినోదాత్మకంగా ఉంది. ఎపిసోడ్ ఆద్యంతం బాలకృష్ణ .. మహేష్ బాబుల మధ్య సాగే రహస్య సంభాషణలు రక్తి కట్టించాయి. నాటి రోజుల్లో ఎన్టీఆర్- కృష్ణ మధ్య గొడవలున్నాయంటూ ప్రచారం సాగేది.. కానీ దానిపై నేటి జనరేషన్ కి తెలిసింది తక్కువ. గుసగుసలు మాత్రమే వినిపిస్తాయి. దీనిపై మహేష్- బాలయ్య స్వయంగా క్లారిటీనిచ్చారు.

సీనియర్ ఎన్టీఆర్ కి , కృష్ణ కి మధ్య ఎప్పుడూ గొడవలు జరగలేదు. నిజానికి కృష్ణ స్వయంగా ఎన్టీఆర్ వీరఅభిమాని. అల్లూరి సీతారామ రాజు చూసిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కృష్ణ నటనను మెచ్చుకున్నారు. అది మాకు అరుదైన క్షణం అని మహేష్ బాబు అన్నారు. అంతేకాదు.. తాను బాలకృష్ణ నటించిన ప్రతి సినిమా చూస్తానని మహేశ్ బాబు చెప్పారు. బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమాలను చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానని మహేష్ అన్నారు.
AP Police Recruitment 2022 Notification Scientific Assistant Jobs Apply Online @ appolice.gov.in
RBI Assistant Recruitment 2022