ఏడు వారాల నగలు అంటే పేరు వినడమే కానీ చాలా మందికి తెలీదు. ఏడు వారాలు అనగా ఆది ,సోమ,మంగళ, బుధ ,గురు .శుక్ర. మరియు శనివారం. పూర్వకాలంలోని వాళ్ళకి ఏడు వారాల నగలుండేవి. మరియు వాళ్ళకుండేవని గొప్పగా చెప్పుకునేవారు. అయితే మొదటగా ఆదివారం సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు కావున ఆరోజు కెంపు రత్నమున్న నగలు, కమ్మలు ధరించేవారు. తర్వాత సోమవారం చంద్రుడు , ఇతనికి ఇష్టమైనది ముత్యం కావున సోమవారం నాడు ముత్యాలహారాలు , ముత్యాల గాజులు ధరించేవారు. తర్వాత మంగళవారం కుజుడు , కావున కుజుడికి ఇష్టమైన పగడాల దండలు , పగడాల ఉంగరాలు వేసుకుంటారు. ఆ తర్వాత బుధవారం బుధుడికి ఇష్టమైన రోజు కావున ఆకు పచ్చని నగలు, హారాలు ధరించేవారు.

అలాగే గురువారం గురుడు అంటే బృహస్పతికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు పుష్యరాగంతో కమ్మలు ,ఉంగరాలు ధరించేవారు. . ఇక శుక్రవారం శుక్రునికి ఇష్టమైనది వజ్రం. కావున శుక్రవారం నాడు వజ్రాల హారాలు , ముక్కు పుడకల తో అమ్మవారిలాగా దర్శనమిచ్చేవారు. చివర గా శనివారం శనీశ్వరునికి ఇష్టమైన రోజు కావున శనివారం నాడు నీలం మణి తో చేసిన హారాలు ,కమ్మలు, ముత్యాలు ,ఉంగరాలు పెట్టుకునేవారు. ఈ విధంగా ఆడవారు వారానికి సరిపడే నగలతో, ప్రతిరోజు చక్కగా అలంకరించుకునేవారు. అయితే అప్పట్లో ఏడు వారాల నగలు ధరించే వారికీ అదృష్టం ఉండాలని చెప్పేవారు. ముఖ్యంగా ఆ నగలున్న ఆడవారు సంతోషంగా భావించేవారు. మరియు ఐశ్వర్యవంతులని చెప్పేవారు.