Thursday, November 25, 2021
spot_img

ఓటిటిల హవా మాములుగా లేదు

డిజిటల్ రంగంలో ప్రస్తుతం ఓటిటీ హవా నడుస్తోంది. ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ , ఇప్పుడు చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లలో కొత్త సినిమాలను చూసేస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు కొత్త టెక్నాలజీ రావడం తో , సినిమా వీక్షణలోనూ మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. దీనికి అనుగుణంగానే అందరు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న డిజిటల్ ప్లాట్ ఫామ్స్ తో పాటు, ప్రేక్షకులను ఆనందింపచేయటానికి అంటూ ఇంకా భారీ ఓటిటీలు రంగ ప్రవేశం చేయబోతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రాంతీయ ఓటిటీ లు కూడా వచ్చాయి. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్లదే రాజ్యమని గ్రహించిన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 100% తెలుగు కంటెంట్ల తో ఆహా ఓటిటికీ శ్రీకారం చుట్టారు. తర్వాత రామ్ గోపాల్ వర్మ , వ్యాపారవేత్త సాగర్ మజునూరు తో కలిసి స్పార్క్ అనే ఓటిటి ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ క్రమంలోనే కింగ్ నాగార్జున , దగ్గుబాటి వెంకటేష్ కుటుంబాలు కూడా ఓటిటి బిజినెస్ పెట్టడానికి అడుగులు వేస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే సినిమా నిర్మాతగా , అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు యాక్టింగ్ స్కూల్స్ ను విజయవంతంగా నడిపిస్తున్న నాగార్జున , ఇప్పుడు డిజిటల్ రంగంలో కూడా రాణించాలని దగ్గుబాటి కుటుంబం సహాయం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఓటిటితో పాటు నిర్మాత సురేష్ బాబు భారీ డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు ,ముంబయి టీమ్ తో కలిసి ఓ కొత్త ఓటిటిని తయారుచేయటానికి సిద్ధం చేస్తున్నారట. అయితే ఇదే క్రమంలో హైఫ్లిక్స్ అనే సరికొత్త ఓటిటి ని హైదరాబాద్, వాషింగ్టన్ డీసీ లలో కేంద్రాలుగా భారీ ఎత్తున ప్రారభించబోతున్నారని సమాచారం. ఇక ఇదే క్రమంలో చిన్న సినిమాలను విడుదల చేసే మరో స్మార్ట్ మల్టీ ప్లెక్స్ అనే ఓటిటి కూడా విడదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కరోనా నేపథ్యంలో ఓటిటిల ప్రాధాన్యత పెరుగుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
3,033FollowersFollow
18,800SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles