సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నాడు. ప్రస్తుతం మహేష్ ,పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారడు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశముంది. బ్యాంకులను మోసం చేసే వ్యాపారవేత్తలను టార్గెట్ గా చేస్తూ తీసే చిత్రమే సర్కారీ వారి పాట. ఇందులో మహేష్ బాబు తండ్రి బ్యాంకు మేనేజర్ కాగా , అతనిని ఓ పెద్ద వ్యాపారవేత్త మోసం చేస్తారు. దీంతో అతడికి చెడ్డ పేరు వస్తుందని, ఈ నేపథ్యంలో తన తండ్రి పరువు కాపాడాలని , వ్యాపారవేత్తను పట్టించేందుకు మహేష్ చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ అని అంటున్నారు. సర్కారీ వారి పాట సినిమా ప్రకటన ఎప్పుడో వెలువడింది. కానీ పూజ కార్యక్రమాలు గత లాక్ డౌన్ సమయంలో జరిగాయి.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలోనే మొదలయింది. ఇందులొ మొదట షూటింగ్ దుబాయిలో జరిగింది . అక్కడ హీరోతో కొన్ని ముఖ్యమైన సంఘటనలను చిత్రీకరించారు. ఇంకా 70% షూటింగ్ జరగాల్సి ఉందని చెప్పారు. తెలుగులో మహేష్ చేసే సినిమాలకి ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకు అనుగుణంగానే సర్కారీ వారి పాట సినిమాకు భారీ డీల్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రాంతాలను బట్టి డిస్ట్రిబ్యూటర్స్ డీల్స్ చేస్తున్నారంట.

ఇందులో భాగంగానే నైజాం హక్కులకై 40 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారంట. సర్కారీ వారి పాట సినిమాను పాన్ ఇండియా లెవెల్ ల్లో రిలీజ్ చేస్తారని కొన్ని ప్రత్యేక వర్గాలు చెప్తున్నారు. ఈ సినిమాకు మహేష్ కోప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కావున పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి మహేష్ బాబే కారణమని చిత్ర బృందం అంటున్నారు. దీనికి అనుగుణంగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కంటే మహేష్ సుమారుగా 20 నుంచి 30 కోట్లు స్వయంగా అతనే ఖర్చు పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మొత్తానికి ఈ ప్రకటన త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తారని మూవీ టీమ్ అంటున్నారు.