Tuesday, May 10, 2022
spot_img

మోనాలిసా ఎవరు? అసలు మోనాలిసా గురించి ఏది నిజం?

ప్రపంచంలో అద్భుతమైన పెయింటింగ్‌లు ఎన్ని ఉన్నా, వాటిలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయేది మోనాలిసా చిత్రమే. ఎంతో చరిత్ర ఉన్న ఈ కళాఖండం వెనుక చాలా కథనాలే ఉన్నాయి. ఎన్ని కథనాలు ఉన్నాయో దానికి తగ్గ అనుమానాలు కూడా ఉన్నాయి. కథలు, అనుమానాల సంగతి పక్కన బెడితే.. చాలామంది ప్రముఖులు ఈ పెయింటింగ్‌కు ముగ్ధులై లియోనార్డో డావిన్సీ గీసిన ఈ చిత్రం నకలు ఫోటోలను తమ ఇళ్లలో పెట్టుకున్నారు. మరి అసలు మోనాలిసా సంగతులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

            మొనాలిసా లియోనార్డో డావిన్సీ అనే ప్రముఖ ప్రాచీన చిత్రకారుడు చిత్రించిన ప్రఖ్యాతి గాంచిన చిత్రపటం. దీనిని 16వ శతాబ్దంలో ఇటలీ పునరుజ్జీవన కాలంలో ఆయిల్ పెయింటింగ్ గా చిత్రించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది నిస్సందేహంగా ప్రపంచంలో అత్యంత ఖ్యాతి గాంచిన చిత్ర పటమే.ఎందుకంటే మరే కళాఖండానికి ఇంతటి ప్రఖ్యాతి లభించలేదు. దీనిని గురించి ఎంతో మంది ఎన్నో పరిశోధనలు చేశారు. దీని మీద ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇది ఇప్పుడు ఫ్రెంచి ప్రభుతం యొక్క స్వాధీనంలో ఉంది. ఈ చిత్రం ఫ్రాన్సిస్కో డెల్ భార్య లిసా ఘెరార్దిని యొక్క చిత్తరువుగా భావించబడుతోంది. ఈ చిత్రం 1503 మరియు 1506 మధ్య పెయింట్ చెసినట్టుగా భావించబదుతుంది.

          మోనాలిసా చిత్రం ఒకప్పటి ఫ్రెంచ్‌ రాజు భార్యకు చెందినది అని కొందరు అంటే, కాదు కేవలం డావిన్సీ మదిలో తోచిన ఓ ఊహా చిత్రం అని మరికొందరు అన్నారు. ఇంకో కథ ఏమిటంటే, చారిత్ర కంగా మోనాలిసా ఒక ఫ్లోరెంటైన్‌ పెద్దమనిషి భార్య. నిజమైన పేరు లిసా డెల్‌ జియోకొండో. ఇటలీలోని ఫ్లోరెన్స్‌ నగరంలో జన్మించిన వస్త్రవ్యాపారి గికాండోను పెళ్లాడింది. అప్పుడు ఆమె వయసు పదిహేను సంవత్సరాలు. భర్త మరణం తర్వాత ఆమె నన్‌గా మారింది. ఆమె చనిపోయిన తర్వాత భౌతికకాయాన్ని సాన్టార్‌సోలా కన్వెన్ట్స్‌లో ఉంచారు. 2014వ సంవత్సరంలో ఆమె మోనాలిసా అవునా కాదా అన్నది తెలుసుకోవడానికి ఆమె ఎముకలపై డీ.ఎన్‌.ఏ పరీక్షలు నిర్వ హించారు. అయితే ఆ పరీక్షలకు సంబంఽధించిన రిజల్ట్స్‌ మాత్రం ఇంకా రావల్సి ఉంది. ఇప్పటి వరకూ కూడా మోనాలిసా చిత్రపటం తప్ప ఆమె అసలు రూపానికి ఇంత వరకూ ఏ ఒక్క రుజువు లేదు.

               మోనాలిసా అందరికీ తెలుసు. అయితే ఆమె చిందించే చిరునవ్వు వెనకాల ఓ రహస్యం దాగి ఉంది. అదేమిటంటే ఓసారి చూసినప్పుడు ఆమె చిరునవ్వు నవ్వుతున్నట్లు, ఇంకోసారి మామూలుగానూ కనిపిస్తున్నట్లుందంటారు.  దీనిమీద ప్రపంచంలో చాలా పరిశోధనలు కూడా జరిగాయి అయితే ఈ మధ్యనే ‘లూయిస్ మార్టినెజ్ ఓటెరో’ అనే ఒక న్యూరో శాస్త్రవేత్త ఓ విషయం కనిపెట్టారు. మనం ఈ చిత్రాన్ని చూసేటప్పుడు మన కంటి రెటీనాలోని ఏ సెల్స్‌ పికప్‌ చేసుకొని ఏ ఛానల్‌ ద్వారా మెదడుకి ఇమేజ్‌ను పంపిస్తుందన్న దానిపై చిత్రంలో చిరునవ్వు ఉందా లేక సీరియస్‌నెస్‌ ఉందా అనేది ఆధారపడుతుంది అని ఆయన చెప్పారు.

           మోనాలిసా అసలే స్ర్తీయే కాదనీ, స్ర్తీ రూపంలో ఉన్న పురుషుడనీ ఇటలీ చరిత్రకారుడు విన్సెటీ పేర్కొనడం సంచలనానికి తెరదీసింది. కొన్ని సంవత్సరాల నుంచీ విన్సెటీ ప్రత్యేకంగా డావిన్సీ చిత్రాలపై విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. వాస్తవానికి డావిన్సీ తన శిష్యుడైన గియాన్‌ గియాకొమో కాప్రోటీ అనే యువకుడినే మోడల్‌గా స్వీకరించి ఆ చిత్రాన్ని సృజించి ఉండొచ్చని అంటున్నారు.

         ఇంకా లియోనార్డో డావిన్సీ, తనను తాను యుక్తవయసులో ఉన్నప్పుడు, ముసలితనంలో ఉన్న ప్పుడు ఎలా ఉంటాడో ఊహించుకుని మోనాలిసా చిత్రంగా చిత్రీకరించాడనేది కొందరు సిద్ధాంత కర్తలు చెప్పే విషయం. అమోన్ అంటే పురుషుడు లిసా అంటే స్త్రీ అనే ఈ రెండు లాటిన్ పదాలను కలిపి ‘మోనాలిసా’ అని కొందరు అంటారు.

             మోనాలిసా చాలా వింతగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ముఖంలో కనుబొమ్మలు కనబడవు. కనుబొమ్మల ప్రదేశంలో నునుపైన చర్మం ఉండటం వల్ల కొంచెం వింతగా అనిపిస్తుంది.

             ఇలా అనేక కథనాలు మోనాలిసా పెయింటింగ్ వెనుక దాగి ఉండి ఇప్పటికి ఒక మిస్టరీ గానే ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
3,300FollowersFollow
19,600SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles