Monday, May 16, 2022
spot_img

లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.. అవేంటో మీకు తెలుసా..?

లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని ప్రతీ ఒక్కరు భావిస్తారు. అయితే శ్రీ మహాలక్ష్మీ మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి. ఈ సంకేతాలు తెలుసుకుంటే డబ్బు ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది.కోయిల కూత శుభసూచకం. వినడానికి ఎంతో వినసొంపుగా ఉండి, మనసుకు ప్రశాంతత చేకూరుస్తుంది. అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభసూచకంగా చెబుతారు. కోయిల సాయంత్రం పూట కూస్తే శుభ సూచకంగా పరిగణిస్తారు.

ఏదైనా పనిమీద బయటికి వెళ్ళేటప్పుడు కోయిల కూస్తే మంచి ప్రయోజనం వుంటుంది. మామిడి చెట్టు మీద కూర్చుని కోయిల కూస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుంది. బల్లి పడితే అశుభంగా చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ బల్లి వల్ల కూడా శుభ సూచకాలు ఉన్నాయి. ఆకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడి త్వరత్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతోందని అర్థం చేసుకోవాలి.బల్లిని సంపదకు చిహ్నంగా భావిస్తారు.

ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభసూచకం.కానీ ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మీ ఇంట్లో అప్పు భారం పెరిగే అవకాశం ఉంటుంది. పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెబుతారు. ఇంట్లో రెండు తలల పాము ని చూస్తే అది శుభ సూచకంగా పరిగణించాలి. ఈ పామును ఎప్పుడూ కూడా చంపడానికి ప్రయత్నించకండి. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిందంటే ప్రజల్లో ఆలోచనలు, వ్యవహార శైలిలో మార్పు వస్తుంది. రాగద్వేషాలు,ఈర్ష్య, అసూయ లాంటివి తగ్గుతాయి. ఆనందం పెంపొందుతుంది

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
3,307FollowersFollow
19,600SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles