Monday, May 16, 2022
spot_img

బాబా మాస్క్ కెవ్వు కేక..

కరోనా వస్తుందన్న భయం కన్నా కూడా పోలీసులు చావగొడతారనే భాదే ఎక్కువగా ఉంటుంది.. అందుకే బయటకు వెళ్ళినప్పుడు చచ్చినట్లు మాస్క్ లను పెట్టుకుంటున్నారు.వీలైనంత వరకు ఇంట్లో ఉండడం, డబుల్‌ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జుగాడు బాబా కరోనా నుంచి రక్షణ కోసం ప్రకృతి మాస్క్‌ ధరించాడు.ప్రస్తుతం బాబా ధరించిన వేప, తులసి ఆకులతో తయారు చేసిన మాస్క్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోను రూపీన్‌ శర్మ అనే ఐపీఎస్‌ అధికారి ట్విటర్‌లో పోస్టు చేస్తూ ”ఈ మాస్క్‌ కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని కచ్చితంగా చెప్పలేం.కానీ అవసరం తల్లి లాంటిది” అని పేర్కొన్నాడు.జనాలు సాధారణంగా ఉపయోగించే మాస్క్‌ల కంటే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నట్టు బాబా తెలిపారు. తులసి, వేప ఆకులతో చేసిన ఈ మాస్క్‌ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. కాగా జుగాడు బాబా ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా బస్ స్టాండ్ వద్ద ఈ ప్రకృతి మాస్క్‌తో కనిపించినట్లు తెలుస్తుంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
3,308FollowersFollow
19,600SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles