పోలవరం పర్యటనలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు చేదు అనుభవం ఎదురైంది. తమకు ఇంతవరకు అర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదని పేర్కొంటూ కొందరు నిర్వాసితులు మంత్రిని నిలదీశారు. పాతపైడిపాక గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదని పేర్కొంటూ గ్రామంలోనే ఉంటున్నాయి. అయితే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయాలని అధికారులు పలుమార్లు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో పోలవరం పర్యటనకు వచ్చిన మంత్రిని అక్కడి ప్రజలు అడ్డుకున్నారు.. అర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దాంతో వారి సమస్యను వెంటనే పరిష్కరిస్తానని అనిల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఇది కాస్త రాజకీయ చర్చ్ లకు దారి తీసింది..