Friday, May 13, 2022
spot_img

CM YS Jagan Mohan : అలాగైతే ఎమ్మెల్యేలకు టిక్కెట్లుండవ్: హెచ్చరించిన వైఎస్ జగన్

CM YS Jagan Mohan : వైసీపీ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ‘స్వీట్’ వార్నింగ్, వైసీపీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించేస్తోంది. పనిచేసే ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో మంచి పదవులు దక్కుతాయని చెబుతూనే, పనితీరులో అలసత్వం ప్రదర్శించే ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లు ఇచ్చే సమస్యే లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా తేల్చి చెప్పేశారు.

ప్రతిరోజూ ఎమ్మెల్యేల పని తీరుపై సమీక్ష జరుపుతానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పడంతో వైసీపీ ఎమ్మెల్యేలలో కొంత ఆందోళన నెలకొంది. వచ్చే ఎన్నికలు వైసీపీకి మరింత ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. ఎంత గొప్ప పాలన అందించినా, అధికారంలో వున్నవారికి ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత వుంటుంది. దాన్ని విపక్షాలు క్యాష్ చేసుకోవడం జరుగుతుంటుంది.

2019 ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకుంది వైసీపీ. ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చినవారి సంఖ్య కూడా కలుపుకుంటే, ఆ సంఖ్య అటూ ఇటూగా 160 వరకూ చేరుకుంటుంది. అంటే, వచ్చే ఎన్నికల్లో 160 ప్లస్ సీట్లను వైసీపీ గెలుచుకోవాలి. లేదంటే, వైఎస్సార్సీపీ పని తీరు పట్ల ప్రజలు సంతృప్తిగా లేరనే భావించాల్సి వుంటుంది.

అందుకే, సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ళ ముందే పార్టీ శ్రేణులకు సరైన దిశా నిర్దేశం చేయడానికి వైఎస్ జగన్ నడుం బిగించారు. ముందుగా ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజలు ప్రభుత్వం పట్ల సంతృప్తిగా వున్నారో లేదో తెలుసుకునే బాధ్యత ఎమ్మెల్యేదనని వైఎస్ జగన్ చెప్పడం గమనార్హం. ఏదిఏమైనా, ముందస్తుగా ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల కోసం సన్నద్ధం చేయడం ద్వారా.. పార్టీలో వైసీపీ అధినేత జోష్ పెంచారన్నది నిర్వివాదాంశం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
3,307FollowersFollow
19,600SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles