కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల తర్వాత సీటీ స్కానింగ్ కీలకంగా మారింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా కూడా స్కానింగ్‌లో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ గుర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సీటీ స్కానింగ్‌తో రేడియేషన్ భయం, ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు రోజుల తరబడి ఆలస్యం కావడంతో వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారికి కూడా చికిత్స సకాలంలో అందడం లేదు.
గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్టు ఆర్ట్పార్క్ సీఈవో ఉమాకాంత్ సోని చెప్పారు. ఇప్పటివరకు 500 మంది డాక్టర్లు సేవలను వినియోగించుకొన్నారని పేర్కొన్నారు. వచ్చే 15 రోజుల్లో 10వేల మంది వైద్యులకు ఈ సాంకేతికత అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. 6-8 నెలలవరకు తమ సేవలకు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని చెప్పారు.
ఈ కరొన ఫలితం తెలుసుకొవాలంటే..
డాక్టర్ www. xraysetu.com లోకి వెళ్లాలి.
ఎక్స్రేసేతు బీటా బటన్‌పై క్లిక్ చేయాలి.
వాట్సాప్ చాట్‌బాక్స్ ఓపెన్ అవుతుంది.
వైద్యుడు +91 80461638638 నంబర్‌కు వాట్సాప్ చేయాలి.. ఎక్స్‌రే సేతు సర్వీస్ అందుబాటులోకి వస్తుంది.తర్వాత వైద్యుడు రోగి ఎక్స్‌రేను వాట్సాప్ చేయాలి.
10-15 నిమిషాల్లో ఫలితం తెలుస్తుంది.