కాకి ఇంటి ముందు గట్టిగా అరిస్తే ఏం జరుగుతుంది? కాకి తలపై తన్నితే అశుభమా? కాకి అరిస్తే శుభవార్త వింటామా? కాకి తలపై తన్నితే భయపడిపోయేంత అపనమ్మకం ఒకటి ఉన్నది. కాకి శని వాహనం కాబట్టి కాకి తలకు తగిలితే శనిదోషం తగులుతుందని, యముడి రాకకు సంకేతమని భయపడతారు. కానీ దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఒకవేళ భయంగా ఉంటే శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకుంటే, దోషం పోతుంది.

జంతువులు, పక్షులు హిందూ సాంప్రదాయం తో అనేక నమ్మకాలు కలిగి ఉంటాయి. మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని, మరి కొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు. అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు. కాకి అరిస్తే మీరు చేయబోయే పనులు విజయవంతం అవుతాయని సంకేతం.
నీళ్ళు నిండుగా ఉన్న కుండపైన కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. నోటితో కాకి ఏదైనా పట్టుకుని దాన్ని మరిచిపోయి పడేస్తే అది అశుభానికి సంకేతం. కాకి మాంసం ముక్కను కింద ఏ వ్యక్తి పైనైనా పడిస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందనేది ఒక నమ్మకం. కాకి ఎగురుతూ వచ్చి తాగితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతారట. ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. కాకి మహిళ ఒళ్ళో గానీ తలపై కానీ కూర్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతాడని సంకేతం. కాకి ఇంటి పరిసరాల్లో ఉన్నప్పుడు బియ్యం గింజలను బయట వేస్తే మన ఇంట్లోకి దరిద్రం రాకుండా ఉంటుంది.