రాజకియాలు అంటే పార్టీలు మారడం సహజం.. ఇప్పుడు కూడా అలాంటి ఘటన ఎదురైంది..బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల 8వ తేదీన ఈటల కాషాయ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి చేరడానికి ముందే ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్కు ఆయన రాజీనామా చేయనున్నారు. శుక్రవారం (రేపు) చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు రాజీనామాకంటే ముందే ఈటలను సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈటల తన అనుచరులతో సమాలోచనలు జరిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీ ఛైర్మన్ ఉమ ఉన్నారు. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికలో తన సతీమణి జమునను పోటీలో నిలిపే యోచనలో ఈటల ఉన్నట్లు సమాచారం.. ఇక ఎంత మంది ఆయన తో వెళ్తారొ చూడాలి..