ప్రస్తుతం మనకు ఇమ్యూనిటీ చాలా అవసరం.. అందుకే ఎన్నో రకాల పదార్థలను తీసుకుంటారు.వాము ,తులసి తో తయారు చేసిన టీ తాగితే హెల్త్ కు చాలా మంచిదని అంటున్నారు.ఆ టీ ఎలా తయారు చేస్తారొ చూడాలి..
కావల్సినవి: అర టేబుల్ స్పూన్ వాము, 5 తులసి ఆకులు, అర టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ తేనె.
తయారీ: స్టవ్ మీద గిన్నె పెట్టి, అందులో గ్లాసు నీళ్లు పోసి, వాము, మిరియాల పొడి, తులసి ఆకులు వేయాలి. ఐదు నిమిషాలపాటు మరిగించాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని కప్పులోకి వడగట్టాలి. కొద్దిగా చల్లారిన తరువా తేనె కలుపుకుని తాగాలి.
ఈ టీ వల్ల కలిగే ప్రయోజనాలు..
వాములో ఔషధ గుణాలు పుష్కలం. దీర్ఘకాల రోగాలు నయం చేయడానికి ఆయుర్వేదంలో దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. సాధారణ జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీనికి తులసి, మిరియాలు, తేనె జత చేయడంవల్ల మరింత ప్రభావవం చూపిస్తుంది..