Thursday, January 20, 2022
spot_img

కరోనా తగ్గాలంటే వైఎస్ భారతిని సీఎం చేయండి..

ఏపి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా కూడా ఇలా వ్యతిరేకత ఏర్పడటం అమానుషం. కాగా, ఇప్పుడు ఆయన సతీమణి భారతి సీఎం అయితే రాష్ట్రం సుభీక్షంగా ఉంటుందని అంటున్నారు. ఏపీని కరోనా వైరస్ భయపెడుతోంది. కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య కట్టడి కావడం లేదు. కరోనా బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది.

గత 24 గంటల్లో 24 వేలకుపైగా కరోనా కేసులు నమోదైతే.. కరోనా కారణంగా వందకు పైగా మరణాలు సంభవించండం ఆందోళన పెంచుతోంది.తాజాగా నమోదైన కేసులు చూస్తే లాక్ డౌన్ తప్పదనే సంకేతాలు అందుతున్నాయి. దీనిపై సీఎం జగన్ రేపు నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.చిత్తూరులో 2885, తూర్పు గోదావరి జిల్లాలో 2876, విశాఖలో 2041, పశ్చిమగోదావరి జిల్లాలో 2426 కేసులు నమోదయ్యాయి. ఇక మిగిలిన జిల్లాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. గుంటూరులో 1787, కడపలో 1638, కృష్ణలో 705, కర్నూలులో 730, నెల్లూరులో 1593, ప్రకాశంలో1628, శ్రీకాకుళంలో 1509, విజయనగరం జిల్లాలో997 కరోనా కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా రోగులకు సరైన వసతి కూడా లేకుండా పోయింది.. దీంతో మరణాలు పెరుగుతున్నాయని దీంతో బీజేపి కీలక నేత విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో అన్నీ అస్తవ్యవస్తంగా ఉన్నాయని విష్ణు కుమార్‌రాజు విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో ప్రజలు అవస్తలు పడుతున్నారని ఆక్షేపించారు. అందుకే ప్రధాన కారణం సీఎం జగన్‌ చేతకానితనమే అన్నారు. ఆక్సిజన్‌ అందక ప్రజలు చనిపోతుండడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది అన్నారు. వెంటనే సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేసి ఆయన సతీమణి వైఎస్‌ భారతికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు.. ఈ విషయం పై ఇప్పటికే రాజకీయ చర్చలు జరుగుతున్నాయి.. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది చూడాలి..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
3,123FollowersFollow
19,100SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles