పురాణాల ప్రకారం ఈ మృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల మరణాన్ని జయిస్తారని పెద్దలు విశ్వసిస్తారు. ఇది సంజీవని మంత్రం అని అంటారు. ఆపదలు కలిగినపుడు, అనూహ్య సమస్యలు ఎదురైనప్పుడు కూడా దీనిని చదువుకోవచ్చును. ఈ మంత్రానికి సర్వ రోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.అందుకే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ మంత్రాలను ఉచ్చరిస్తూ హోమాలు జరుపుకుంటారు.
ఓం త్రయంబకం యజామహే!
సుగంధిం పుష్టి వర్ధనం!
ఉర్వారుక మివ బంధనాత్!
మృత్యోర్ ముక్షీయ మామృతాత్.. !
అనే ఈ మంత్రం యెక్క అర్థం ఏంటంటే.. అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించుచున్నాము. ఆయన దోస పండును తొడిమ నుంచి వేరు చేసినట్టుగా (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను మింగేసేందుకు సిద్ధంగా ఉన్న మృత్యువు నుంచి కాపాడు గాక అని అర్థం..
ఇకపోతే ఈ మంత్రం చాలా పవిత్రమైనది.. అందుకే మూడంకెల సంఖ్య తో పఠిస్తారు. మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్ట శక్తులను తరిమికొడతాయి. దాంతో మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు, ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే సకల దోషాలు నిర్వృర్తి అవుతాయని పెద్దల విశ్వాసం..