సోను సూద్ పేరు ఇప్పుడు ఎక్కడ చూసిన మారు మోగిపోతుంది. ఆయన పేదలకు చేస్తున్న సేవలు అలా ఉన్నాయి.. రీల్ హీరో కాస్త పేదల పాలిట దేవుడయ్యాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూ సూద్ దాతృత్వ సేవలు వెంకటేశ్ ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, తన తల్లిదండ్రులే తనకు స్ఫూర్తి అని ఓ సందర్భంలో సోనూ సూద్ చెప్పిన మాటలు వెంకటేశ్ లో బలంగా నాటుకుపోయాయి. ఈ నేపథ్యంలో, ఎలాగైనా సోనూ సూద్ ను కలవాలని నిశ్చయించుకున్న వెంకటేశ్ హైదరాబాద్ నుంచి ముంబయికి పాదయాత్రగా బయల్దేరాడు.
దోర్నాలపల్లికి చెందిన వెంకటేశ్ ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీ జరగకపోవడంతో ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. తండ్రి ఆటో డ్రైవర్ కాగా, ఇటీవల వాయిదాలు చెల్లించకపోవడంతో వారి ఆటోను ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు స్వాధీనం చేసుకున్నారు.మధ్యలో గుడి కనిపిస్తే సోనూ సూద్ పేరిట పూజలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ముంబయి వెళ్లిన తర్వాత సోనూ సూద్ ను కలిసి, తన కుటుంబ పరిస్థితిని వివరించాలని వెంకటేశ్ భావిస్తున్నాడు.అతని ఆశ ఏమాత్రం ఫలిస్తుందో చూడాలి..