Tuesday, November 30, 2021
spot_img

మరో సినిమాకు నిర్మాతగా విజయ్ దేవరకొండ..

ఈ మధ్య సినిమాలలో నటించడం తో పాటుగా సినిమాలను నిర్మిస్తున్నారు.. అలాంటి వారిలో ఒకరు విజయ్ దేవరకొండ ఒకరు. సినిమాను నిర్మించడం ఒక ఎత్తు .. దానిని బిజినెస్ చేయడం మరో ఎత్తు. అందువలన బాగా నిలదొక్కుకున్నవారే ఆచితూచి అడుగేస్తుంటారు. కానీ, ఈ విషయంలో కూడా విజయ్ దేవరకొండ తనదైన దూకుడు చూపించాడు. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకోవడానికీ .. తొలి సినిమాను పట్టాలెక్కించడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు.

తన బ్యానర్ పై ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాను నిర్మించిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం తన తమ్ముడు హీరోగా ‘పుష్పక విమానం’ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా దామోదర పరిచయమవుతున్నాడు. ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే మరో సినిమాను నిర్మించడానికి విజయ్ దేవరకొండ ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. పృథ్వీసేన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో అంతా నూతన నటీనటులే కనిపిస్తారట.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ షూట్ మొదలుకానుంది..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

21,984FansLike
3,037FollowersFollow
18,800SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles